బావిలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి దుర్మరణం
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రమాదవశాత్తు బావిలోకి బైక్ దూసుకెళ్లడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామానికి చెందిన శీలం రజనీకాంత్(26) తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి గురువారం ఉదయం వెళ్లి, సాయంత్రమైనా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి గాలించారు. ఈక్రమంలో పెద్దలింగాపురం ప్రాఽథమిక పాఠశాల సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయబావిలో బైక్‌తో సహా రజనీకాంత్ పడిపోయి, ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. చుట్టుపక్కల వారి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. రజనీకాంత్ తల్లి దుర్గవ్వ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి లచ్చయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.
Comments
Please login to add a commentAdd a comment