సిరిసిల్లక్రైం: ఆయుర్వేద మందులతో రోగాలు న యం చేస్తానంటూ మాయమాటలు చెబుతూ మో సాలకు పాల్పడిన వ్యక్తిని గురువారం రిమాండ్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వి వరాలు డీఎస్పీ కథనం ప్రకారం. కర్ణాటక రాష్ట్రం చి క్కబల్లాపూర్ జిల్లా నగిరెగరే గ్రామానికి చెందిన అ జయ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోటర్‌సైకిల్‌పై తిరుగుతూ పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యం చేసి తగ్గిస్తానంటూ రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చే శాడు. డబ్బులు తీసుకొని వైద్యం చేయక కాలయాపన చేసేవాడు. అనంతపూర్, మహబూబ్‌నగర్, నా రాయణఖేడ్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో సంచరిస్తూ ఆయుర్వేద వైద్యం పేరుతో మోసం చేసేవాడు. వేములవాడ పరిధి శాత్రాజుపల్లి, ముస్తాబాద్ మండల పరిధిలోని బదనకల్, వెంకట్రావుపల్లి గ్రామాల్లో పలువురి వద్ద డబ్బులు వ సూలు చేశాడు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కొడిమోజు లక్ష్మి భర్తకు పక్షవాతం ఉందని తెలుసుకొని గతేడాది నవంబర్‌లో వారి ఇంటికెళ్లి కలిశాడు. మాయమాటలు చెప్పి ఆమె భర్తకు పక్షపాతం నయం చేస్తానని నమ్మించి రూ.20వేలు ఫోన్‌పే చేయించుకున్నాడు. ఇలా పలు గ్రామాల్లో దాదాపు రూ.6లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. గంభీరావుపేటలో గురువారం తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయాలు వెలుగుచూశాయి. అజయ్ తెలంగాణలో 50 మందికి పైగా మోసం చేశాడని అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, పీసీ శ్రీనాథ్‌ను డీఎస్పీ అభినందించారు.
ఘరానా మోసగాడి రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment