10 కణతిలు తొలగించిన వైద్యులు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో గర్భంతో పాటు గర్భసంచికి పది కణతిలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామానికి చెందిన భూసారపు గంగ (36) పెళ్లయిన 17ఏళ్లకు గర్భం దాల్చింది. మొదటి ప్రసవం కోసం కరీంనగర్ మాతా శిశుకేంద్రానికి వచ్చింది. వైద్యులు వెంటనే స్కానింగ్ చేసి గంగ గర్భసంచికి పది కణతులు (ఫైబ్రాడ్స్) ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం అడ్మిట్ చేసుకున్న వైద్యులు బుధవారం శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్సలో మగ శిశువుకు జన్మనిచ్చింది. గర్భసంచికి ఉన్న పది కణతులు తొలగించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్లు నిఖత్, సంగీత, మనీషా, అనస్తీషియా తిరుపతి బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ గుండా వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీనలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment