ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన నలుగురిని రాజన్నసిరిసిల్ల పోలీసులకు కటకటాల్లోకి నెట్టారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ వివరాలు. కరీంనగర్‌కు చెందిన జడ కొమురయ్య ఎల్లారెడ్డిపేట మండలంలోని రా చర్లగొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్‌స్టాక్ అధికారిగా పనిచేస్తున్నాడు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని మెడికల్ ఇన్‌వాల్యుడేషన్ కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ వెరిఫికేషన్ చేయించగా, నకిలీపత్రాలు సమర్పించినట్లు తేలింది. మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జంపాల రాహుల్ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టారు. మెడికల్ ఇన్‌వాల్యుడేషన్ ద్వారా తన కొడుకుకు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశ్యంతో జడ కొ మురయ్య కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తన కు తెలిసిన కరీంనగర్‌కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించాడు. అతను రూ.3లక్షలు తీసుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మహ్మద్ బాసిద్ హుస్సేన్‌ను పరిచయం చేశాడు. అతని ద్వారా కరీంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశంను కలిశాడు. రాజేశం తన ల్యాబ్‌లో సన్‌షైన్ హాస్పిటల్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్‌లపై తప్పుడు ధ్రువీకరణపత్రాలు, నకిలీ వైద్యుల స్టాంప్‌లు వేసి, సంతకాలు ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు సృష్టించారు. వీటిని కొమురయ్య దరఖాస్తు చేసుకోగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన విషయం ని ర్ధారణ అయింది. పోలీసులు వీరిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment