కొత్తపల్లి(కరీంనగర్): వేసవిలో విద్యుత్ అంతరాయాల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 33 కేవీ లింకింగ్ లైన్స్ గురించి సమీక్షించిన ఆయ న.. వాటిలో మిగిలి ఉన్న పనులను త్వరి తగతిన పూర్తి చేయా లని ఆదేశించారు. నగరంలో విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజీ సమస్య లేకుండా కొత్త డీటీఆర్‌లు ఏర్పాటు చేయా లన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసా య విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేయడంతోపాటు అవసరమైనచోట ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నందున విద్యుత్ అంరాయాల్లేకుండా చూసుకోవాలని, ఆసుపత్రులు, ప్రముఖులున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment