ఫాస్ట్‌బౌలర్.. శ్రీవల్లి
ఇల్లంతకుంట/కరీంనగర్ స్పోర్ట్స్ : చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకొని జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది కట్ట శ్రీవల్లిరెడ్డి. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి– ఉమ దంపతుల చిన్న కూతురు శ్రీవల్లిరెడ్డి మూడో తరగతి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు ఇష్టం మేరకు లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్ ఇప్పించగా, పాస్ట్ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. 2019లో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడా ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2022లో పూణెలో నిర్వహించిన అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల్లో హెచ్‌సీఏ తరఫున పాల్గొంది. ఈ జనవరిలో త్రివేండ్రంలో నిర్వహించిన బీసీసీఐ ఉమెన్స్ అండర్–19 వన్డే ట్రోఫీలో, 2024 డిసెంబర్‌లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన సీనియర్ ఉమెన్ వన్డే టోర్నీలో హైదరాబాద్ తరఫున ప్రాతినిఽథ్యం వహించింది. కాగా.. శ్రీవల్లి కోసం తన తండ్రి ఊరు వదిలి కరీంనగర్, హైదరాబాద్‌లో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment