అన్ని రంగాల్లో ముందున్నారు
పెద్దపల్లిరూరల్: సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సాంకేతిక రంగంలోనూ ప్రతిభ, నైపుణ్యాలతో ముందుంటున్నారు. వాస్తవానికి పురుషులకంటే మహిళల్లోనే మానసిక స్థైర్యం ఎక్కువ. పాతికేళ్ల పాటు పుట్టింట్లో ఉండి, పెళ్లి తర్వాత మెట్టినింట్లో తనకు అంతగా పరిచయం లేనివారి నడుమ ధైర్యంగా జీవించగలుగుతుంది. చదువులో రాణిస్తున్న మహిళలకు న్యాయవ్యవస్థలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికావసరాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకుల వరకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లకు లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం.
– కె.స్వప్నరాణి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, పెద్దపల్లి
అన్ని రంగాల్లో ముందున్నారు
Comments
Please login to add a commentAdd a comment