అతివల ఆనందం
ఘనంగా మహిళా దినోత్సవం
నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గిటారు వాయిస్తున్న మహిళ
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌టౌన్/విద్యానగర్: జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలను ఘనంగా సత్కరించి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ రన్నర్స్, సైకిలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించగా.. జిల్లా జడ్డి ప్రతిమ పాల్గొన్నా రు. కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. కేక్‌కట్ చేసి అందరికీ తినిపించారు. పలువురు అధికారులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీనిధి రుణాల్లో ప్రతిభ చూపిన జమ్మికుంట, హుజూ రాబాద్ పట్టణ సమాఖ్య అధ్యక్షురాళ్లకు సర్టిఫికెట్, మెమొంటో అందించారు. బాలభవన్ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ, నాటక సమాజాల సమాఖ్య, కళా రవళి సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతికి మహిళా శక్తిమాన్ పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఏవో భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు వైద్యాధికారి సుజాత పాల్గొన్నారు. సాంస్కతికశాఖ సహకారంతో కరీంనగర్ ఫిలిం సొసైటీ ఏర్పాటు చేసిన మహిళా విశిష్ట పురస్కారాలను రచయిత్రి తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, జానపద గాయకురాలు గొట్టె కనుకవ్వ, ప్రముఖ నర్తకి గుత్తా నాగదుర్గలకు ఆర్డీవో మహేశ్వర్ ప్రదానం చేశారు. కపిసొ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ, ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఐఎంఏ హాల్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి జెండాఊపి ర్యాలీసి ప్రారంభించారు. తెలంగాణచౌక్ వద్ద మహిళా వైద్యులు, వైద్య విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు.
అతివల ఆనందం
అతివల ఆనందం
అతివల ఆనందం
అతివల ఆనందం
అతివల ఆనందం
అతివల ఆనందం
అతివల ఆనందం
Comments
Please login to add a commentAdd a comment