సమాజాభివృద్ధిలో మహిళలు కీలకం
కరీంనగర్‌రూరల్: సమాజం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అన్నారు. శనివారం భగత్‌నగర్‌లోని కరీంనగర్‌రూరల్ ఎమ్మార్సీ కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు డీఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. ఎంఈవో కె.రవీందర్, ఏసీపీ గంగాధర్, సెక్టోరియల్ అధికారి అశోక్‌రెడ్డి, ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ స్నేహలత, డిప్యూటీ మేనేజర్ దీపిక పాల్గొన్నారు.
‘వైరాగ్యం’కు సన్మానం
కరీంనగర్‌కల్చరల్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల సాహిత్య కళావేదిక వారు కరీంనగర్‌కు చెందిన కవి, రచయిత విమర్శకులు శతాధిక గ్రంథ ప్రచురణకర్త వైరాగ్యం ప్రభాకర్‌కు గౌరవ పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సుందరాచార్యుల వీధిలో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జాతీయ పురస్కారాల సభలో కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చదువుల బాబు వైరాగ్యం ప్రభాకర్‌ను సత్కరించారు. జిల్లాలోని పలువురు కవులు, రచయితలు ప్రభాకర్‌ను అభినందించారు.
నిబంధనలకు విరుద్ధ్దంగా టెండర్లు ఓపెన్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో సుడా నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్‌ను నిబంధనలకు విరుద్ధ్దంగా ఓపెన్ చేశారని నగరపాలకసంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ దగ్గు మహేందర్ రాకేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుడా పనుల టెండ ర్ కన్నా ముందు ఎస్‌డీఎఫ్ పనుల టెండర్లు పి లిచారని, ఎస్‌డీఎఫ్ కన్నా ముందే సుడా టెండర్లు ఓపెన్‌చేశారన్నారు. టెండర్‌లో కాంట్రా క్టర్లు పొందుపరిచిన డాక్యుమెంట్లను సక్రమంగా పరిశీలించలేదన్నారు. నిబంధనలకు విరు ద్ధంగా ఓపెన్‌చేసిన టెండర్లను రద్దు చేయకుంటే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
సిటీలో పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందునా ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కే.వీ.గంజ్ ఫీడర్ పరిధిలోని బోయవాడ, గంజ్, సిఖ్‌వాడీ, మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్, కమాన్, లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్, కమాన్ నుంచి హౌజింగ్‌బోర్డు రోడ్డు ప్రాంతాలతో పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కే.వీ.బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలోని ఎస్‌ఆర్ కళాశాల, తేజ స్కూల్, రెడ్డి హాస్టల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడిఈ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఖాజీపూర్, బావుపేటలో..
నెలవారి మరమ్మతుల్లో భాగంగా ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.ఖాజీపూర్, సాయినగర్, బావుపేట సబ్‌స్టేషన్ల పరిధిలోని ఖాజీపూర్, బావుపే ట, ఎలగందుల, గ్రానైట్ పరిశ్రమలున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
కరీంనగర్‌కల్చరల్: ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనున్నందున ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. శనివారం గణాంక భవన్‌లో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఆర్.శ్రీనివాస్, కట్టా రవీంద్రచారి మాట్లాడుతూ మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, టీఎస్‌సీఎల్‌ఐ తదితరాలకు సంబంధించి వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. గుండా శ్రీనివాస్, కొట్టె లక్ష్మ ణరావు, వెలిచాల వెంకటస్వామి, ఎనగంటి బాలాజీ, సుద్దాల శోభారాణి పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో మహిళలు కీలకం
Comments
Please login to add a commentAdd a comment