2,880 కేసులు పరిష్కారం
కరీంనగర్‌క్రైం: రాజీద్వారా కేసులు సత్వరంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌తో మాత్రమే సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో లోక్‌అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. లోక్ అదాలత్‌పై ప్రజల్లో అవగాహన పెరిగి, అపోహలు తగ్గుతున్నాయని, ప్రతీ లోక్ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ విజయానికి సహకరించిన అందరికీ జడ్జి కృతజ్ఞతలు తెలిపారు. ఏసీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పోలీస్ అధికారులు ఎక్కువ సంఖ్యల కేసుల పరిష్కారానికి కృషిచేశారని, ఈ సందర్భంగా వారిని అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇందుకు న్యాయవాదుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 2,880 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకటేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా 20వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు సాధన, కుమార్ వివేక్, లక్ష్మీకుమారి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి, ఏపీపీలు వీరస్వామి, రంజిత్, గాయత్రీ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
కేసుల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 20వ స్థానం
Comments
Please login to add a commentAdd a comment