కంకర పోశారు.. తారు మరిచారు
గన్నేరువరం: గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు చేపట్టిన డబుల్‌రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని శనివారం గుండ్లపల్లి, గునుకులకొండాపూర్, జంగపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. గునుకులకొండాపూర్‌లో రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డబుల్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా గునుకులకొండాపూర్–జంగపల్లి మధ్య కంకర పోసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అలాగే గుండ్లపల్లి– గునుకులకొండాపూర్ మధ్య కల్వర్టు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాళ్లపల్లి పర్శరాం, గూడెల్లి మల్లేశం, కోతి ఆంజనేయులు, చొక్కల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment