‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు

Published Sun, Mar 9 2025 1:44 AM | Last Updated on Sun, Mar 9 2025 1:41 AM

‘బ్రహ

‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు

ముందుకు

సాగని

ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్‌దీపాల ఏర్పాట్లు మినహా.. ఏ ఒక్క పని కూడా ముందుకు కదలడం లేదు. మరోవైపు ఈనెల 10 నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాల మేరకు జాతరలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. విప్‌, కలెక్టర్‌ కూడా పలుమార్లు సమీక్షించారు. ఇప్పటివరకు బ్రహ్మపుష్కరిణి (కోనేరు)కి రంగులు వేయలేదు. ఆలయం ముందు, వెలుపల గోదావరిలో చలువ పందిళ్లు వేయాల్సి ఉంది. చలివేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు.

ప్రమాదకరంగా సత్యవతి, బ్రహ్మగుండాలు

గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న సత్యవతి, బ్రహ్మగుండాలు అతిలోతైనవి కావడంతో ప్రమాదకరంగా మారాయి. భక్తులు స్నానాల కోసం ఎక్కువగా వీటి వద్దకే వెళ్తుంటారు. అక్కడ ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో రేలింగ్‌, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని విప్‌, కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయడం లేదు. ఆలయంలో స్థలం ఇరుకుగా ఉన్నందును స్వామివారి కల్యాణాన్ని మరోచోట నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ.. కల్యాణ వేదిక వద్ద ఇంకా ఎలాంటి పనులూ చేపట్టలేదు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రనలుమూలలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వీరందరి కోసం సరిపడా వసతులు కల్పించడంలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మందికి ఉచిత అన్నదానం చేసేందుకు రైస్‌మిల్లర్లు, ఆర్యవైశ్యులు, వర్తకసంఘం, ఇతర దాతల సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 మందితో బందోబస్తుకు నిర్ణయించారు.

బ్రహ్మోత్సవాలకు రండి

ఆలయంలో ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దేవస్థానం తరఫున ఈవో శ్రీనివాస్‌ ఆహ్వాన పత్రిక అందించారు. ముందుగా వారికి స్వామివారి శేష వస్త్రం కప్పి ప్రసదాలు అందించారు. కార్యక్రమంలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లు అలువాలు శ్రీనివాస్‌, వావిలాల తిరుపతి తదితరులున్నారు.

భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం. గతంలోకంటే ఈసారి మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే స్వామివారి కల్యాణాన్ని నిర్వహించే స్థలాన్ని గుర్తించాం. ఆ స్థలంలో కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

– ప్రభుత్వ విప్‌ అడ్లూరి

గోదావరి నిర్మానుష్యం

బ్రహ్మోత్సవాల సందర్భంగా 12 రోజుల పాటు గోదావరి భక్తులతో పోటెత్తుతుంది. ప్రస్తుతం గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో రాళ్లు, రప్పలు, మండుటెండల్లో భక్తులు నడిచివెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో చలువ పందిళ్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు గోదావరిలో ఎలాంటి ఏర్పాట్లూ చేపట్టలేదు. దీంతో గోదావరి నిర్మానుష్యంగా మారింది. ఒక్క మంగలిగడ్డ వద్ద తడకలతో చలువ పందిరి వేశారు. ఆ పందిళ్లు భక్తులకు ఏమూలకూ సరిపోవని అంటున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ముఖ్యంగా సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు తడకలతో డ్రెస్సింగ్‌ రూంలు, షెడ్లు, బాత్‌రూంలు, తాగునీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది.

ఈనెల 10 నుంచి 22వరకు కార్యక్రమాలు

సమయం సమీపిస్తున్నా పట్టని అధికారులు

లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం

సౌకర్యాలు కల్పించాలంటున్న భక్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు1
1/2

‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు

‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు2
2/2

‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement