బొగ్గు లారీ బోల్తా
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): భూపతిపూర్ వద్ద గల రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదవశాస్తు బొగ్గు లారీ బోల్తాపడింది. మంచిర్యాల ఆర్‌కే– 6 గని నుంచి బొగ్గు లోడ్‌లో హైదారాబాద్‌కు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
సారంగాపూర్: మండలంలోని మ్యాడారం శివారు ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకొచ్చిన వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గుగిల్ల గంగు (65) తక్కల్లపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం మ్యాడారంతండా వరకు కొట్టుకురావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కథలాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పంచనామా నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● రూ.40 వేల నగదు
● మూడు గ్రాముల బంగారం అపహరణ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గోవిందుపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన చీకోటి రాంబ్రహ్మచారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి వెళ్లి బీరువా పగులగొట్టి అందులో ఉన్న రూ.40వేలు, మూడు గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై గీత సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
వ్యాన్ దగ్ధం
తంగళ్లపల్లి:బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్‌టైల్ పార్కులో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో డీసీఎం వ్యాన్ దగ్ధమైంది. సారంపల్లి ప్లాట్లలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తికి చెందిన డీసీఎంలో వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో మంటలను అదుపు చేయగా.. అప్పటికే పూర్తిగా దగ్ధమైంది.
బొగ్గు లారీ బోల్తా
బొగ్గు లారీ బోల్తా
Comments
Please login to add a commentAdd a comment