అభిషేక ప్రియుడికి ఆది మొక్కులు
వేములవాడ: అభిషేకప్రియుడు వేములవాడ రాజన్నకు భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 30వేల మంది దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండదీపంలో నూనె, తలనీలాలు, నిలువెత్తు బెల్లం పంపిణీ చేశారు. అభిషేకాలకు 150కి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. ఆరుద్రనక్షత్రోత్సవం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు.
పెరిగిన భక్తుల రద్దీ
150కి పైగా అభిషేకాలు
వైభవంగా ఆరుద్ర నక్షత్రోత్సవాలు
అభిషేక ప్రియుడికి ఆది మొక్కులు
Comments
Please login to add a commentAdd a comment