సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో సంబరాలు జరుపుకుంటున్న క్రికెట్ అభిమానులు
మండుటెండల్లో
మంచు దుప్పటి
కరీంనగర్‌రూరల్/మానకొండూర్: మార్చి రెండోవారం.. ఎండలు ముదిరేకాలంలో పొగమంచు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వేసవికాలం కాస్తా రాత్రి నుంచి వేకువజామున వరకు చలికాలంగా మారిపోతోంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వేకువజామున పొగమంచు కమ్మేసింది. కరీంనగర్ రూరల్, మానకొండూర్ మండలంలోని పలు ప్రాంతాలతో పాటు, రాజీవ్‌రహదారి, కరీంనగర్– వరంగల్ రహదారిని ఉదయం 7గంటల నుంచి 8గంటలవరకు మంచుదుప్పటి కమ్మేంది. పొగమంచుతో దారి కన్పించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, మానకొండూర్, చెంజర్ల వద్ద వాహనదారులు లైట్లను వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఇది ఎండాకాలమా, చలి కాలమా అని, ఇలాంటి పొగమంచును వేసవిలో ఏనాడూ చూడలేదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment