కిస్సా కుర్సీకా!
● కాంగ్రెస్‌లో ఏఎంసీ కిరికిరి ● కమిటీ నియమించి రెండు నెలలు ● ఆర్డర్‌కు అడ్డుగా ఆధిపత్యపోరు
కరీంనగర్ కార్పొరేషన్:
ఆధిపత్యపోరుతో సతమతమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ మార్కెట్ కమిటీ నియామకం మరోసారి చిచ్చుపెట్టింది. రెండు నెలల క్రితమే మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించినప్పటికీ.. నేతల నడుమ నెలకొన్న పోరుతో ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. కమిటీ నియామకంపై ఎవరి పట్టు వారిదే ఉండడంతో, జిల్లా కేంద్రంలో మరోసారి అంతర్గతపోరు హాట్‌టాపిక్‌గా మారింది.
అమలుకు నోచుకోని మార్కెట్ కమిటీ
దశాబ్దకాలం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సహజంగానే నామినేటెడ్ పదవులపై తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు దక్కించుకొనేందుకు నాయకులు తమకున్న మార్గాల ద్వారా ప్రయత్నిస్తూ వస్తున్నారు. కరీంనగర్‌కు సంబంధించి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కగా, మరో సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అంజన్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశిస్తున్న సమయంలో, అంజన్‌కుమార్‌ను చైర్మన్‌గా, బొమ్మకల్‌కు చెందిన రాంరెడ్డి వైస్‌చైర్మన్‌గా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకవర్గం ఏర్పాటైంది. జిల్లాకు చెందిన పలువురు నేతల సూచనతోనే కరీంనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియమించినట్లు వినికిడి. అయితే మార్కెట్‌కమిటీ పాలకవర్గం ఏర్పడి దాదాపు రెండు నెలలు దాడుతున్నప్పటికీ, ఇప్పటివరకు అది ఆచరణకు నోచుకోవడం లేదు. సంబంధిత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment