పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కరీంనగర్ అర్బన్: మహిళా దినోత్సవ సందర్భంగా ఈ నెల 11న టీఎన్జీవో, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవన్‌లో జరగనున్న వేడుకల పోస్టర్‌ను ఆదివారం స్థానిక కళాభారతి ప్రాంగణంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి మహిళల కోసం ఉదయం 10:30 గంటలకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కళాభారతిలో జరిగిన అనాథ యువతి మౌనిక(పూజ)– సాయితేజ వివాహానికి టీఎన్జీవో లు, టీజీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులు రూ.54వేల సాయం అందించారు. టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో రూ.20వేల విలువ గల ఫర్నిచర్ అందించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ తరపున రూ.15వేలు, డీడీ మార్కెటింగ్ పద్మావతి రూ.10వేలు అందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవో జిల్లా కార్యదర్శి అడ్ల అరవిందరెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, సర్దార్ హర్మిందర్ సింగ్, మహిళా ఉద్యోగ సంఘ నాయకులు సునీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment