ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులో ఓ పాడుబడ్డ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం నిల్వ ఉందన్న సమాచారంతో ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం దాడులు జరుపగా సుమారు 8 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్‌లై అధికారులకు అప్పజెప్పారు. దాడుల విషయాన్ని గమనించిన బియ్యం నిల్వ చేసిన వ్యక్తి పారిపోయాడని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.
కాలువలో పడి యువకుడు మృతి
మానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన గొర్రె నరేశ్ (30) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. నరేశ్ సెంట్రింగ్ పనిచేసేవాడు. ఇదే మండలంలోని కొండపల్కల గ్రామంలో అతడి బంధువు చనిపోగా, శనివారం ద్విచక్రవాహనంపై కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన వెంట తెచ్చుకున్న తాళంచెవి మరిచి పోయాయని కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దించి తిరిగి కొండపల్కల వైపు వెళ్తుండగా, మద్దికుంట శివారులోని కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. బండరాయిపై నరేశ్ పడిపోగా, బైక్‌కూడా అతడి మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కాలువలో నుంచి తీసి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి వెంటకయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
పూడిక తీస్తుండగా మట్టిపెల్లలు పడి కూలీ..
చందుర్తి(వేములవాడ): మండలంలోని లింగంపేటకు చెందిన గద్దెరాసి రాములు(44) బావిలో పూడికతీస్తున్న క్రమంలో మట్టిపెల్లలు పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఇదే మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య వ్యవసాయ బావిలో శనివారం పూడికతీత పనులు చేస్తున్న సమయంలో మట్టిపెల్లలు పడి రాములు తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వేములవాడ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు బావి యజమాని మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని సీతా రాంపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు కొండం సంపత్‌రెడ్డి (45) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పదినెలల క్రితం సంపత్‌రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి జాతరకు వెళ్లగా జరిగిన ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఎడమచేయి కోల్పోయాడు. అప్పుడు దాదాపు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఎడమచేయి కోల్పోయినా బతుకుదెరువు కోసం పాన్ డబ్బా పెట్టుకుని జీవనం సాగించాడు. కాగా, ఈ ప్రమాదానికి ముందు రూ.4 లక్షల అప్పు చేసి కూతురు వివాహం చేశాడు. ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేకపోవడం, ఏలాంటి ఆస్తులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్‌రెడ్డి ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
కడుపునొప్పితో వివాహిత..
తిమ్మాపూర్(మానకొండూర్): కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ 8వ డివిజన్ పరిధి అల్గునూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్గునూరుకు చెందిన సిల్ల శిరీష(25) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా పరిస్థితి మెరుగుపడలేదు. ఆదివారం నొప్పి ఎక్కువ కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ఆటో డ్రైవర్, ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment