ఫోన్ ఎత్తుకెళ్లి రూ.1.40 లక్షలు ట్రాన్స్‌ఫర్
తరలివచ్చి.. తరించి
వేములవాడ: రాజన్నను ఆదివారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. భక్తుల ద్వారా రూ.35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే పునర్వసు నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయంలోని సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు పంచోపనిషత్ ద్వారాభిషేకం చేశారు. పరివార దేవాతార్చనలు, సదస్యం నిర్వహించారు.
జమ్మికుంట(హుజూరాబాద్): పరిచయం పెంచుకొని ఫోన్ ఎత్తుకెళ్లి అకౌంట్ నుంచి రూ.ఒక లక్ష 40 వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకొని మోసం చేసిన ఘటన జమ్మికుంటలో జరిగింది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి అబాది జమ్మికుంట గ్రామానికి చెందిన మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ పారడైజ్ బిర్యాని సెంటర్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్‌బాష (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం) అప్పుడప్పుడు బిర్యాని సెంటర్‌కు వస్తూ పరిచయం చేసుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లోవారికి ఫోన్ చేసి ఇస్తానని మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ నుంచి మహమ్మద్ ఇమ్రాన్‌బాష ఫోన్ తీసుకొని పరారయ్యాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ రూ.ఒక లక్షా 40 వేలు అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
ఫోన్ ఎత్తుకెళ్లి రూ.1.40 లక్షలు ట్రాన్స్‌ఫర్
Comments
Please login to add a commentAdd a comment