శివకల్యాణోత్సవానికి ఏర్పాట్లు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు రాజన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రధానాల యం ముందు ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం శివకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని అర్చకులు చెబుతున్నారు. 12న కామదహనం, మూడు రోజులపాటు డోలోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 17న (సోమవారం) ఉదయం పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారల కల్యాణం, 19న సాయంత్రం ఉత్సవమూర్తుల రథోత్సవం, 20న అవబృత స్నానం, త్రిశూలయాత్ర, పూర్ణాహుతి, ఏకాదశవరణములతో ఉత్సవాలు సమాప్తమవుతాయని తెలిపారు.
విశేషమిది..
రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాల్లో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్విదినం రోజునే కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. కానీ వేములవాడలో మాత్రం శ్రీస్మార్థ వైదికశ్రీ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి జాతర అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరుపుకుంటారని ఇక్కడి అర్చకులు తెలిపారు.
ఈనెల 16 నుంచి ఐదు రోజులు ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment