తడారి.. మేతగా మారి..
కరీంనగర్‌రూరల్: సాగునీరందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బావుల్లో పూడిక తీయిస్తుండగా మరికొందరు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. అయితే ఎలాంటి ఆధారం లేని రైతులు ఎండిపోతున్న పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా విడిచిపెడుతున్నారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో బతుకమ్మ చెరువు కట్టకింద సాగు చేసిన పొలాలన్నీ నీళ్లులేక ఎండిపోతున్నాయి. రైతులు దుర్గం మల్లేశ్‌కు చెందిన 20 గుంటలు, దాడి ఓదెలు 10గుంటల వరిపొలమంతా ఎండిపోవడంతో ఆదివారం గొర్రెల మేతకు విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment