‘యువికా’తో ఆలోచనలకు మెరుగు
జ్యోతినగర్(రామగుండం): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)స్కూల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ‘యువ విజ్ఞాన కార్యక్రమ్ (యువిక)– 2025 ద్వారా పిల్లల ఆలోచనలకు మె రుగులు దిద్దితే.. భావితరానికి శాస్త్రవేత్తలుగా మా ర్చుకోవచ్చనే విషయాన్ని గుర్తించిన ఇస్రో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక, అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 23వ తేదీలోగా అర్హులైన, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖా స్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్త ంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు తెలిపారు.
వెబ్‌సైట్: విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో (www.irso.gov.in) వైబ్‌సైట్ ప్రారంభించారు. సైట్ ఓపెన్ చేసిన తర్వాత యువికా ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో విద్యార్ధికి సంబంధించిన వివరాలతో దరఖాస్తు పూరించాలి.
● ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
● జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
● స్పేస్, సైన్స్ క్లబ్‌లో నమోదై ఉంటే 5 శాతం..
● ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం..
● గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం .
యువికా ఉద్దేశం ఇదే..
ఇస్రో నిర్వహిస్తున్న యువికాకు ఎంపికై న విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రడూన్, తిరువనంతపురం, షిల్లాంగ్, బెంగళూరు, హైదరాబాద్, సూళ్లూరిపేట తదితర కేంద్రాల్లో మేలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం
ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమ్ – 2025
విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
తొమ్మిదో తరగతి చదువుతున్న వారు అర్హులు
దరఖాస్తుల దాఖలుకు గడువు..
ఈనెల 23 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు గడువు.
ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు.
మే 18న విద్యార్థులను ఆహ్వానిస్తారు.
మే 19 నుంచి 30 వరకు యువికా–2025 కార్యక్రమం నిర్వహణ
మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ.
ఎంపికై న విద్యార్థులు బస్సులు, రైళ్ల ద్వారా వెళ్తే ప్రయాణ రాయితీ కల్పించడంతో పాటు వసతి, బస ఏర్పాటు చేస్తారు.
విద్యార్థులకు చక్కని అవకాశం
ఇస్రో నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ కార్యక్రమం విద్యార్థులకు చక్కని వేదిక. విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసుకునేందుకు చక్కని అవకాశం. తల్లిదండ్రులు, సంబంధిత ఉపాధ్యాయులు ఆసక్తి ఉన్న విద్యార్థులతో దరఖాస్తులు చేసే విధంగా ప్రోత్సహించాలి.
– రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి
‘యువికా’తో ఆలోచనలకు మెరుగు
Comments
Please login to add a commentAdd a comment