జీకే ఒలింపియాడ్‌లో ప్రతిభ
కొత్తపల్లి: న్యూఢిల్లీకి చెందిన పోటీ పరీక్షల సంస్థ గ్లోబల్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన పాఠశాల స్థాయి జీకే ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఒలింపియాడ్‌లో ఎ.మయాంక్ రెడ్డి (4వ తరగతి), ఎ.మాన్యశ్రీ పటేల్ (5వ), ఎ.అక్షిత నాయక్ (6వ), కె.భువనశ్రీ (6వ), యం.శివెన్ రెడ్డి (7వ), కె.సాయి వర్షిత్ (7వ), యన్.కృష్ణప్రతీక్ (9వ), జి.హెమంత్ జాదవ్ (9వ), కె.విశ్వక్సేన్ (9వ)లు కాంస్య పతకాలు, ప్రశంసాపత్రాలు, ఎస్పీ.కృష్ణచైతన్య (7వ) రజత పతకం, ప్రశంసాపత్రం సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. భవిష్యత్‌లో నిర్వహించబోయే వివిధ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment