కరీంనగర్‌ వినియోగదారుల ఫోరం ఏర్పాటు: 1987 నమోదైన కేసులు: సుమారు 9వేలు బాధితులు పొందిన పరిహారం: రూ.21కోట్లు | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ వినియోగదారుల ఫోరం ఏర్పాటు: 1987 నమోదైన కేసులు: సుమారు 9వేలు బాధితులు పొందిన పరిహారం: రూ.21కోట్లు

Published Mon, Mar 17 2025 11:06 AM | Last Updated on Mon, Mar 17 2025 11:06 AM

కరీంనగర్‌ అర్బన్‌:

నిర్ణీత రుసుము చెల్లించి వస్తుసేవలు పొందుతున్న ప్రతివ్యక్తీ వినియోగదారుడే. మనం ఖర్చు చేసే ప్రతీ పైసాకు నాణ్యమైన వస్తు సేవలను పొందడం మన హక్కు. కానీ నిత్యావసర, అలంకరణ, దుస్తులు, గృహ వినియోగ పరికరాలు ఒక్కటేమీ.. ఎందులో చూసినా నాసిరకమే. నిర్ణీత రుసుం చెల్లించి ప్రభుత్వం నుంచి హక్కుగా పొందాల్సిన సేవలకు సైతం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ అధికారులకు ముడుపులు ముట్టజెబితే గానీ పలుశాఖల్లో సకాలంలో స్పందించడం లేదు. ఈ క్రమంలో నాణ్యమైన సేవలు పొందేందుకు విని యోగదారుల ఫోరం చక్కని వేదికగా నిలుస్తోంది.

అవగాహన అవసరం

జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తే వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుంది. పౌర సేవాపత్రం ప్రకారం ప్రతి పనిని నిర్ణీత సమయంలో చేయాలని నిబంధనలున్నా నేటికి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు కావడం లేదు. దీంతో వినియోదారునికి తీరని నష్టం కలుగుతోంది. బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మోసాలను, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సేవా లోపాలను అవగాహనతో ప్రశ్నించినప్పుడు మాత్రమే వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందుతాయి. తమకు జరిగిన నష్టాన్ని కర్మ అని వదిలేయకుండా జిల్లా ఫోరంలో కేసులు నమోదు చేసి తమకు జరిగిన వస్తుసేవా లోపాలకు వడ్డీతో నష్టపరిహారం పొంది విజయం సాధించిన వినియోగదారులూ ఉన్నారు.

రశీదు తప్పనిసరి..

బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే వంద రూపాయాల నిత్యావసర వస్తువుల నుంచి. రూ.వేలు పెట్టి కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా రశీదు పొందాలి. కొన్న వస్తువుకు సరిపడా రశీదు మన వద్ద ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, నిబంధనల ప్రకారం కంపెనీ సర్వీస్‌ ఇవ్వకున్నా సకాలులో ఫోరంలో కేసు నమోదు చేసి వినియోగదారునికి జరిగిన వస్తు, సేవల నష్టపరిహారాన్ని వడ్డీతో సహా పొందవచ్చు.

ఉండాల్సిన విషయాలు

ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, అవతలి పార్టీ(వ్యాపారి, డీలర్‌) పూర్తి పేరు చిరునామా, ఫిర్యాదు చేయడానికి కారణాలు, ఎప్పుడు..? ఎలా..? సంబంధించి.. ఏవిధంగా నష్టపోయింది. దస్తావేజులు, రశీదులు, పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలి. ఏ విధమైన నష్ట పరిహారం కోరుతున్నారో వివరాలతో పాటు ఫిర్యాదుదారు సంతకం ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement