పెద్దపల్లిరూరల్: ప్రభ్వు ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదువులో వెనుకబడిన వారిని గుర్తించడం, ఏఐ(కృత్రిమ మేధ) సాయంతో పాఠాలు బోధించడం, విద్యాబోధనలో లోటుపాట్లను సరిదిద్దడం లక్ష్యంగా చేపట్టిన కార్యాచరణ అమల్లోకి వచ్చింది. జిల్లాలోని 15 ప్రైమరీ పాఠశాలలను తొలివిడతలో ఎంపిక చేయగా.. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు మారుమూల ప్రాంత విద్యార్థులకోసం మరో ఐదు పాఠశాలలను గుర్తించారు. దీంతో జిల్లాలో ఏఐ బోధన అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 20కి చేరింది. ఈ విద్యాసంవత్సరంలో ఎంపిక చేసిన ప్రైమరీ స్కూళ్లలో 3, 4, ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏఐ సాయంతో సాధన చేయనున్నారు.
చదవడం.. రాయడంపై ప్రత్యేక శ్రద్ధ
ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదవడం, రాయడంలో వెనకపడిన వారిని ప్రోత్సహించేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారు. కొంతమంది విద్యార్థులు అక్షరాలు, సంఖ్యను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్లు గతంలో సర్కారు బడుల్లో చేపట్టిన అధ్యయనాలు తేల్చాయి. దాదాపు సగంమంది ఇలాంటివారే ఉన్నట్లు ఆ నివేదికల ద్వారా తెలుస్తోంది.
కలెక్టర్ చొరవతో ఇంటర్నెట్..
75 హెడ్‌సెట్లు మంజూరు..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సి(ఏఐ) ద్వారా జిల్లాలో చేపట్టిన విద్యా బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం లేని 9 పాఠశాలలకు ఆ సౌకర్యం కల్పించే పనులు పూర్తయ్యాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ఏఐ పాఠ్యాంశాలను వినేందుకు అవసరమైన హెడ్‌సెట్లు విద్యార్థులకు అవసరమని సంబంధిత అధికారులు చేసిన వినతికి కలెక్టర్ శ్రీహర్ష సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే 75 హెడ్‌సెట్లను సమకూర్చారు.
ఏఐ సాయంతో విద్యాబోధన మార్గం
హైస్కూల్ ఆవరణలోని ప్రైమరీ స్కూళ్లలోనే అమలు
తొలివిడతలో ఎంపికై ంది 15 ప్రభుత్వ పాఠశాలలు
మలివిడతలో మరో ఐదు బడుల ఎంపికకు చర్యలు
శిక్షణ ఇలా..
జిల్లావ్యాప్తంగా 15 పాఠశాలల్లో అమలుకు తొలుత నిర్ణయించినా కలెక్టర్ సూచన మేరకు మరో 5 పాఠశాలల్లో(మంథని, ఎక్లాస్‌పూర్, కొలనూర్, అంతర్గాం, గోదావరిఖని) అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్ల ఆవరణలోని ప్రైమరీ స్కూళ్లనే ఏఐ అమలుకు ఎంపిక చేసినట్లు విద్యాశాఖ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థి తనకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పాఠాలను సాధన చేస్తాడని ఉపాధ్యాయుడొకరు తెలిపారు. లాగిన్ అయిన విద్యార్థి సామర్థ్యాన్ని కంప్యూటర్ అంచనా వేస్తుందని, తదుపరి సాధనలో విద్యార్థి ఏదైనా అక్షరం, సంఖ్యను తప్పుగా గుర్తిస్తే ఒప్పుగా నేర్చుకునే వరకు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలోనే సాధన జరుగుతుందని పేర్కొన్నారు.
కొత్త విషయాలు తెలుసుకున్న
కంప్యూటర్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, గణితంలో చాలా విషయాలను సులువుగా అ ర్థం చేసుకున్నా. మా టీచర్ ప్రమేయం లేకుండా నేర్చుకోవడం కొత్త అనుభూతిని ఇచ్చింది. విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం ఫోన్‌లో ఆట ఆడినంత సులువుగా ఉంది.
– అనిత, నర్సింహులపల్లి
ప్రయోగాత్మకంగా అమలు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకోసం ఏఐ సాయంతో వి ద్యా బోధన చేస్తున్నాం. 3, 4, ఐదో తరగతి విద్యార్థుల కు సులువుగా అర్ధమయ్యే లా విద్యాబోధన చేస్తున్నాం. ఈ విధానంతో స ర్కారు బడులు మరింత బలోపేతం కానున్నాయి.
–ప్రభాకర్, ఎంఈవో, ధర్మారం
సామర్థ్యం పెంపు లక్ష్యం
సామర్థ్యం పెంపు లక్ష్యం