● అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్
కరీంనగర్ అర్బన్: పద్దెనిమిదేళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కోరారు. ఓటరు నమోదు కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. 18ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకొనేవారు, తప్పుల సవరణ చేసుకొనేవారు, డబుల్ ఓటర్ నమోదు సవరణ చేసుకొనేవారు, ప్రాంత మార్పిడి చేసుకొనేవారు, చనిపోయిన వారి ఓటు తొలగింపుకు సంబంధించి ఫారంను ఉపయోగించాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.మహేశ్వర్, ఏవో గడ్డం సుధాకర్, వివిధ రాజకీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.