
బనశంకరి: రెండేళ్లపాటు పరస్పరం ప్రేమించుకుని ఇద్దరి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో నిశ్చితార్థం చేశారు. అయితే పెళ్లి కొద్ది రోజులు ఉండగా యువతి మరో యువకుడితో పారిపోయింది. నగర శివారులోని ఆవలహళ్లినివాసి జోసెఫ్ అనే యువకుడు రెండేళ్లుగా క్యాత్రిన్ అనే యువతిని ప్రేమించాడు. యువతి కూడా జోసెఫ్‌ను ఇష్టపడింది. వివాహానికి రెండు నెలలు సమయం ఉంది.
అంతలోగా యువతి మరో యువకుడితో పారిపోయింది. నిశ్చితార్థం అయిన యువకుడు కాబోయే అత్తకు వివాహ ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇవ్వగా యువతి ఉడాయించడంతో తన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో బాధితుడు జోసెఫ్ ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment