
ఆత్మహత్య చేసుకున్న నవ దంపతులు (ఫైల్)
యశవంతపుర: వరుసకు అన్నా చెల్లి అయిన యువతీ యువకుడు ప్రేమ మోహంలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగి జిల్లా యడ్రామి తాలూకా మాగణగేరా గ్రామంలో జరిగింది. శశికళ (20), గొల్లాళప్ప (24) అనేవారు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు. కానీ ప్రేమించుకున్నారు, దీనిని ఇరువైపులా పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు.
శశికళకు మరో యువకునితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. వచ్చే నెలలో పెళ్లి జరగాలి. ఇంతలో గొల్లాళప్ప శుక్రవారం రాత్రి శశికళను మాగణగేరాకు తీసుకెళ్లి గుడిలో తాళి కట్టాడు, సెల్ఫీ తీసుకుని మిత్రులకు పంపి, ఆపై అక్కడే చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. యడ్రామి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తమను పెద్దలు శాశ్వతంగా విడదీస్తాయరనే ఆవేదనతో ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకొంది.