ఫరీదా, గిరీశ (ఫైల్)
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి హత్య
బెంగళూరులో ఉన్మాద ప్రేమికుడు
బనశంకరి: దారి తప్పిన ప్రేమ హత్యకు దారితీసింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆమె గొంతుకోసి, 15 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ ఘోరం బెంగళూరు జయనగర పరిధిలో జరిగింది. సైకో ప్రేమికుడు గిరీశ అలియాస్ రియాన్ ఖాన్ (35)ను జయనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆదివారం పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. యడియూరు నివాసి గిరీశ్ డ్రైవరుగా పనిచేసేవాడు. దేవుని పూజను వ్యతిరేకించే ఇతను 2011లో ఇస్లాం మతంలోకి మారి రియాన్ గా పేరు పెట్టుకున్నాడు. ఆ తరువాత ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. సోదరికి పెళ్లి సంబంధాలు దొరకలేదు. దీంతో మళ్లీ హిందూ మతంలోకి మారిన గిరీశకు కూడా వివాహం చేసుకోవాలనుకుంటే అమ్మాయి దొరకలేదు.
మహిళతో ప్రేమాయణం
2022లో ఓ మసాజ్ పార్లర్‌లో కోల్‌కతా కు చెందిన ఫరీదా (42) అనే మహిళ గిరీశకు పరిచయమైంది. విడాకులు తీసుకున్న ఫరీదాకు పెళ్లీడుకు వచ్చిన కుమార్తె ఉంది. తరువాత బతుకు తెరువు కోసం ఫరీదా బెంగళూరుకు చేరుకుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని గిరీశ కోరగా ఫరీదా తిరస్కరించేది. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుని ఇద్దరూ జేపీ.నగర హోటల్‌లో ఉన్నారు. శనివారం జయనగర శాలిలీ మైదానంలోకి పిలిపించుకున్న గిరీశ పెళ్లి సంగతి ప్రస్తావించగా ఫరీదా ససేమిరా అంది. కోపోద్రిక్తుడైన గిరీశ చాకుతో ఆమె గొంతుకోసి, శరీరంపై 15 సార్లు చాకుతో పొడిచి హతమార్చాడు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment