వీధికుక్కల స్వైరవిహారం
హొసపేటె: విజయనగర జిల్లాలోని కొట్టూరు పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోంది. పుట్టరాజ్ లాల్‌బహదూర్ శాస్త్రి, బసవేశ్వర ముదుకన కట్టె, కెల్లేరి రాజీవ్ నగర్‌లతో పాటు రోడ్లలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లో ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేయడంతో చిన్న పిల్లలు రోడ్డుపై ఆడుకోలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై నడవాల్సి వస్తోంది. కుక్కల బెడదపై పలు సంఘ సంస్థల సభ్యులు పట్టణ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. మహిళలు ఉదయం బహిర్భూమికి వెళ్లే సమయంలో సీనియర్ సిటిజన్లపై కూడా కుక్కలు దాడులు చేయడం వంటి ఘటనలు ఇటీవల జరిగాయి. విచ్చలవిడిగా సంచరిస్తున్న కుక్కలపై సత్వరం తగిన చర్యలు తీసుకోవాలని మహంతప్ప, మంజునాథ్, మండక్కి ప్రకాష్, షఫీ తదితరులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment