నేత్రపర్వంగా సుత్తూరు జాతర
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని శ్రీక్షేత్ర సుత్తూరులో జరుగుతున్న ఆది జగద్గురు శివరాత్రీశ్వర శివయోగి జాతర మహోత్సవం వేడుకలకు శుక్రవారం తెరపడింది. గడిచిన ఐదు రోజుల నుంచి సాగిన ఈ జాతర వేడుకల్లో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి పాల్గొని వీక్షించారు. ఆరు రోజులపాటు సాగిన ఈ వేడుకల్లో వివిధ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యవసాయ మేళా, పశువుల జాతర, దేశీయ ఆటలు, నాటకాలు, కుస్తీ పోటీలు ఇలా అనేక రకాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. జాతరలో పాల్గొన్న భక్తులు ఇక్కడికి తరళి వచ్చి దీపాలను వెలిగించారు. దీపోత్సవం విహంగ దృశ్యాలను మొత్తం డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో సుత్తూరు మఠం పరిసరాలు మొత్తం కన్నుల పండగలా కనిపించింది. సుత్తూరు వద్ద నదిలో కపిలా హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి సమయంలో నిర్వహించిన ఈ హారతి వేడుకలకను చూడడటానికి భక్తులు తరలి వచ్చారు. బాణసంచా వెలుగుల మధ్య నదిలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు.
మఠం వద్ద భక్తుల సందడి
Comments
Please login to add a commentAdd a comment