పురందర కీర్తనలు సర్వశ్రేష్టం
హొసపేటె: కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాస కీర్తనలు సర్వకాలానికి శ్రేష్టమైనవని దాస సాహిత్య ప్రాజెక్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ అనంత పద్మనాభ తెలిపారు. పురందర ఆరాధన మహోత్సవం సందర్భంగా పురందర మంటపంలో మంత్రాలయ మఠం గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు తరపున మూడు రోజుల పాటు జరిగిన పురందరదాస ఆరాధనోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పురందర దాస కన్నడలో సమాజంలోని అన్ని వర్గాలకు అర్థమయ్యేలా కీర్తనలు రచించారన్నారు. ఆయన కీర్తనలు, పదాలు, పద్యాలతో సమాజంలోని ఎత్తు పల్లాలను చాలా పరోక్షంగా, హత్తుకునేలా చెప్పారన్నారు. మంత్రాలయ మఠంలోని సుబుధేంద్ర తీర్థ దేశ వ్యాప్తంగా దాస సాహిత్యం విస్తరణ కోసమే కాకుండా అన్ని వర్గాల ఐక్యత కోసం భజన పరిషత్తులను రూపొందించి తద్వారా సమాజాభివృద్ధికి పాటు పడ్డారన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరాధనోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భజన సభ్యులు భజన, నృత్యం, కోలాటం, సెమినార్లు, దాస సాహిత్య చిత్రపటం పట్టుకుని నృత్య గీతాలతో ప్రదక్షిణలు చేశారు. ఉత్తరాధన సందర్భంగా ఉదయం పురందర దసరా మంటపం వద్ద దసరా రాయల స్థూపానికి విశేష ఫల పంచామృతాభిషేకం, నైవేద్యం, వివిధ పుష్పాలు, వస్త్రాలంకరణ నిర్వహించారు. అనంతరం హరి వాయుస్తుతి పారాయణం నిర్వహించారు. మఠాధిపతి పవన్ ఆచార్య, మేనేజర్ సుమంత్ కులకర్ణి, అర్చకులు నరసింహాచార్యులు, ప్రముఖులు శిరేకోల గురురాజ్, విజయ్‌కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దాస సాహిత్య ప్రాజెక్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ అనంత పద్మనాభ
హంపీలో మూడు రోజుల పాటు
వేడుకగా ఆరాధనోత్సవం
Comments
Please login to add a commentAdd a comment