అవినీతిపరుల గుండెల్లో రైళ్లు | - | Sakshi
Sakshi News home page

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు

Published Sat, Feb 1 2025 12:19 AM | Last Updated on Sat, Feb 1 2025 12:19 AM

-

శివాజీనగర: ఆదాయానికి మించి వందల రెట్లు ఆస్తులు గడించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై లోకాయుక్త కొరడా ఝుళిపించింది. బెళగావి, బాగలకోటె, బెంగళూరుతో పాటుగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయాన్నే లోకాయుక్త అధికారులు ఏడుగురు అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. బీబీఎంపీ జోనల్‌ ఇంజినీర్‌ ఏఈఈ మాధవరావు విద్యారణ్యపుర నివాసం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ సెక్రటరీ టీ.కే.రమేశ్‌ నివాసం, బాగలకోటెలోని విద్యాగిరిలో ఉన్న హొలగేరి జీపీ పీడీఓ శివలింగయ్య హిరేమఠ నివాసం, బెళగావి ఉత్తర రిజిస్ట్రేషన్‌, ముద్రణా శాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ సచిన్‌ మండెద, బెళగావిలో రాయబాగ వెటర్నరీ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ అణ్ణప్ప దుర్గణ్ణనవర్‌ ఇంటితో పాటు వివిధ చోట్ల లోకాయుక్త అధికారులు దాడి చేశారు. రాయచూరు జెడ్పీ లెక్కపత్రాల అసిస్టెంట్‌ అధికారి నరసింగ్‌రావు గుజ్జార్‌కు చెందిన రాయచూరులోని జవహర్‌ కాలనీలో ఉన్న భవంతిపై దాడి చేసిన అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

బెళగావిలో దాడి:

బెళగావి ఉత్తర సబ్‌ రిజిస్ట్రర్‌ సచిన్‌ మండేద, రాయబాగ పశు వైద్యాధికారి సంజయ దుర్గన్ననవర్‌కు సంబందించి అనగోళ, హారోగేరి, బెల్లద బాగేవాడిలో సోదాలు జరిగాయి. బాదామి తాలూకాలోని హొలగేరి జీపీ పీడీఓ శివలింగయ్య హిరేమఠకి సంబంధించి మూడు చోట్ల దాడి చేశారు. బాగలకోటె విద్యాగిరిలో నరగుంద ఇంటిపై లోకాయుక్త డీఎస్‌పీ సిద్దేశ్‌ నేతృత్వంలోని బృందం దాడి చేసి, పరిశీలన చేపట్టింది. బెంగళూరు నగర లోకాయుక్త పోలీస్‌ అధికారులు బీబీఎంపీ హెబ్బాళ ఉప విభాగపు ఏఈఈ మాధవరరావు ఇంటితో పాటు రెండు చోట్ల, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ డిప్యూటీ సెక్రటరీ టీ.కే.రమేశ్‌ ఇల్లు, పాఠశాల, హులియారుదుర్గలో ఉన్న భూమితో పాటు నాలుగు చోట్ల పరిశీలన చేశారు. ఆధారాల పరిశీలన ఇంకా కొనసాగుతోందని లోకాయుక్త ఎస్పీ డాక్టర్‌ కే.వంశీకృష్ణ సమాచారం అందించారు.

భారీగా నగదు స్వాధీనం:

హొలగేరి పీడీఓ ఎస్పీ హిరేమఠ విలాసవంతమైన ఇంటిలో బయటపడిన నగదు నోట్లను లెక్కించేందుకు లోకాయుక్త అధికారులు ఇంటిలోపలికి నగదు లెక్కించే యంత్రాన్ని తీసుకెళ్లారు.

పలు జిల్లాల్లో లోకాయుక్త దాడులు

పెద్ద ఎత్తున బయటపడ్డ ఆస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement