వ్యవసాయం, పరిశ్రమలతో రాష్ట్రాభివృద్ధి
మైసూరు: బసవణ్ణ ఆశయాలన్నింటినీ భారత రాజ్యాంగంలో రాశారని, దానిని సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని సుత్తూరు క్షేత్రంలో జరుగుతున్న శివరాత్రీశ్వర శివయోగి జాతర మహోత్సవం చివరి రోజు శుక్రవారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లౌకిక సమాజ నిర్మాణం, భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశమన్నారు. శరణ శ్రేష్టులైన బసవాది శరణుల ఆశయం కూడా అదేనని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని బసవన్న ఆశయాల ప్రకారం కులం, మతం పేరుతో మనుషుల్లో తారతమ్యాలను, మూఢ నమ్మకాలను విడిచి పెట్టాలన్నారు. మనకు లభించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రం లేకుంటే స్వాతంత్య్ర ఆశయ ఫలాలు నెరవేరవని అన్నారు. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం దేశంలో అన్ని సముదాయాల వారికి వర్తిస్తుందని అన్నారు.
సుత్తూరు ఆధ్యాత్మిక క్షేత్రం
ముఖ్యమంత్రి సిద్దరామయ్య
Comments
Please login to add a commentAdd a comment