వేతన బకాయిల కోసం ధర్నా
గౌరిబిదనూరు: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నగర శివారులో హిందూస్థాన్ డిస్టలరీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సంఘం కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ 109 మంది కార్మికలకు వేతన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం ఆస్తుల విక్రయించడానికి ప్రయత్నిస్తోందన్నారు. బకాయిలు విడుదల చేయడంతోపాటు పీఎఫ్ తదితర చెల్లింపులు చేయాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు సిఎస్ మోహన్, నరసింహమూర్తి వెంకటేశప్ప, నాగరాజు, మూర్తి,బాలయ్య, నాగేశ్,నాగప్ప, నిరంజన్, మురళి పాల్గొన్నారు.
పుట్టగొడుగులతో ఉపాధి
హోసూరు: మహిళలు స్వయం ఉపాధి కోసం వ్యవసాయ శాఖ ద్వారా మహిళలకు పుట్టగొడుగుల ఉత్పత్తిపై శిక్షణ శిబిరం నిర్వహించారు. అంచెట్టి తాలూకా తళి నియోజకవర్గంలోని ఉరిగం గ్రామంలో మహిళా సంఘాల ప్రతినిధులతు శిక్షణ అందజేశారు. వ్యవసాయ శాఖ ఉపడైరక్టర్ మురుగన్ , అధికార్లు సెల్లయ్య, మణిగంటన్, గణేష్‌మూర్తి, వెంకటాచలపతి పాల్గొన్నారు. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆదాయం గడించవచ్చని, మెలకువలు పాటించి ఎక్కువ దిగుబడులు పొందాలని సూచించారు.
అడవి జంతువు దాడిలో
గొర్రెలు మృతి
క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలో కొట్టంలో కట్టేసిన గొర్రెలపై ఏదో అడవి జంతువు చేసిన దాడిలో 11 గొర్రెలు మృతి చెందాయి. వివరాల మేరకు ఊత్తంగేరి సమీపంలోని నల్లవన్‌పట్టి గ్రామానికి చెందిన రఘుపతి, గొర్రెలను పోషిస్తున్నాడు. సోమవారం రాత్రి కొట్టులోకట్టేసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం కొట్టువద్దకెళ్లే సరికి 11 గొర్రెలు గాయాలతో చనిపోయి ఉన్నాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఊత్తంగేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ధృవీకరణ పత్రాల పంపిణీలో జాప్యంపై ఫిర్యాదు
చింతామణి: జనన, మరణ పత్రాలు ఇవ్వడంలో అధికారలు జాప్యం చేస్తున్నారని చింతామణి లాయర్లు మంగళవారం తహసీల్దార్ సుదర్శన్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ స్పందించి తక్షణమే సంబంధిత అధికారిని పిలిచి సర్టిఫికెట్ల పంపిణీలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. లాయర్లు సంఘం పదాదికారులు పాల్గొన్నారు.
వేతన బకాయిల కోసం ధర్నా
Comments
Please login to add a commentAdd a comment