దైవ కార్యాలతో ప్రశాంతత సాధ్యం
మాలూరు: గ్రామీణ ప్రజలకు ఆలయాల్లో పూజా కార్యక్రమాల వంటి దైవ కార్యాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో నెమ్మది లభిస్తుందని మాజీ మంత్రి ఎస్‌ఎన్ కృష్ణయ్య శెట్టి తెలిపారు. సోమవారం మాస్తి ఫిర్కా రాజేనహళ్లి జీపీలోని సొణపనహట్టిలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన గంగమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఆలయాల నిర్మాణానికి దాతలు ఇతోధికంగా సహకరించాలన్నారు. పూర్వీకులు నిర్మించిన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయాలన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార, విచారాలకు అధిక ప్రాధాన్యత నిచ్చేవారు నూతన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొనగా, భక్తులకు కృష్ణయ్య శెట్టి చీర, పంచ, కండువా, వాయనం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment