● ప్రేమజంట దాష్టీకం
యశవంతపుర: ప్రేమజంట ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడింది. అప్పుడే పుట్టిన శిశువును హత్య చేసి వదిలించుకున్నారు. బెళగావి జిల్లా కిత్తూరు అంబడగట్టి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన మహబలేశ్ కామోజీ (31), సిమ్రాన్ మాణికాబాయ్ (22)లు ప్రేమించుకుని అప్పుడప్పుడు కలిసేవారు. యువతి గర్భం ధరించింది. మూడురోజుల కిందట నెలలు నిండి కాన్పయింది. సిమ్రాన్ యూట్యూబ్‌లో చూసి తన ప్రసవాన్ని తనే చేసుకుంది. శిశువును తీసుకుని ప్రియునికి ఇచ్చింది. ఇద్దరు కలిసి పసిగుడ్డును ప్లాస్టిక్ పేపర్‌లో చుట్టి చూపిరాడకుండా చంపేశారు. శిశువును నిర్మానుష్య ప్రదేశంలో పారవేశారు. శిశువు మృతదేహం కనిపించడంతో గ్రామంలో అలజడి రేగింది. పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శిశువు తమదేనాని ప్రేమ జంట ఒప్పుకొంది. అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని జైలుకు పంపారు. ప్రేమ పేరుతో ఇంత అఘాయిత్యానికి పాల్పడతారా? అని ప్రజలు కలవరానికి గురయ్యారు.