
మల్లెలు కేజీ రూ.2 వేలు
దొడ్డబళ్లాపురం: ఉగాది పండుగ అంటే తెలుగు, కన్నడ నూతన సంవత్సరాది, ఏడాది మొదటిరోజును ఆనందోత్సాహాలతో ఆచరించాలని అందరూ అనుకుంటారు. పండుగ వచ్చింది కదా అని పూలు పండ్ల వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెంచేశారు. అయినప్పటికీ శనివారం జనం మండే ఎండలను కూడా లెక్కచేయకుండా మార్కెట్లకు తరలివచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు నగరాలకు క్యూ కట్టారు. కొత్త బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పండ్లు, కూరగాయలు, పూల ధరలు కాస్త అందుబాటులో ఉన్నా ఉగాది పేరుతో వ్యాపారులు ధరలను పెంచారు. బెంగళూరు బజార్లలో మల్లెపూలు కేజీ రూ.1800 నుంచి 2000 మధ్య పలికాయి. చామంతులు రూ.250, గులాబీలు రూ.200, చెండుపూలు రూ.80, కాగడాలు రూ.600, కనకాంబరాలు రూ.1000, తులసి మాల మూర రూ.100, వేప కొమ్మలు కట్ట రూ.25, మామిడి ఆకులు కట్ట రూ.25 కి విక్రయించారు. కేఆర్ మార్కెట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
ఉగాది వేళ భగ్గుమన్న ధరలు
నగరంలో మార్కెట్లు కిటకిట

మల్లెలు కేజీ రూ.2 వేలు

మల్లెలు కేజీ రూ.2 వేలు