
క్రిమినల్ చర్యలు చేపట్టాలి
రాయచూరురూరల్: నగరలోని మోథడిస్ట్ చర్చి, బాల్డ్‌విన్ విద్యాసంస్థ మాజీ చీఫ్ యనయల్, కర్కరేపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మోథడిస్ట్ చర్చి ఇండియా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళనకు దిగారు. జిల్లాద్యక్షుడు అబ్రహాం జో హన్ మాట్లాడారు. కర్కరే 2016 నుంచి ఆయా సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో డ్యానియల్, సురేంద్ర, అశీర్వాదం, నందకుమార్, ప్రమోద్, సిమోన్, రుబిన్, లక్ష్మయ్య, శాంతరాజ పాల్గొన్నారు.