
రేపు హంపీ కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న విశ్వవిద్యాలయ ఆవరణలోని నవరంగ బయలు ప్రదేశంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ పరశివమూర్తి తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ మంటప సభాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవం సందర్భంగా నాడోజ బిరుదులను ముగ్గురు ప్రముఖులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన ప్రముఖ రచయిత, ఆలోచనాపరుడు కుంబార వీరభద్రప్ప, ధార్వాడకు చెందిన ప్రముఖ హిందూస్థానీ గాయకుడు పద్మశ్రీ ఎం.వెంకటేష్ కుమార్‌కు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులు మీదుగా నాడోజ బిరుదులను ప్రదానం చేస్తారని తెలిపారు. అదే విధంగా పీహెచ్‌డీ, డీ.లిట్‌లతో పాటు వివిధ పట్టాలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సుధాకర్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విజయ్ పూణచ్చ తంబండ తదితరులు పాల్గొన్నారు.

రేపు హంపీ కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం