
వణికించిన భారీ వర్షం
హొసపేటె: నగరంలో బుధవారం అర్ధ రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి అర్ధ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ముందు ఉన్న ఇంటి ముంగిట వర్షం నీరు నిలబడి జలమయంగా మారింది. రాజీవ్ నగర్‌తో పాటు ఆర్‌టీఓ కార్యాలయం రోడ్లలో మోకాలి లోతు వరకు వర్షం నీరు నిలబడడంతో పాదచారులకు, వాహనదారులు, విద్యార్థులకు కష్టకరంగా మారింది. టీబీ డ్యాం ప్రధాన రహదారిలో చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం విరిగి నేలవాలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది వారాల నుంచి వేసవి ఎండలతో సతమతమవుతున్న నగరవాసులు వర్షంతో చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదించారు.
తడిచి ముద్దయిన హొసపేటె నగరం
విద్యుత్ సరఫరా నిలిచి జనం పాట్లు