
మేలుకోటెలో ఘనంగా గరుడ ధ్వజారోహణ
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ చెలువ నారాయణ స్వామివారి వైరముడి బ్రహోత్సవం సందర్భంగా దేవానుదేవతలను వేడుకలకు ఆహ్వానిస్తూ ఇష్టరథం కరుణించాలని ప్రార్థిస్తూ శుక్రవారం గురుడ ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుమారు 9.30 గంటలకు గరుడ దేవుడి పటంలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. 3వ స్థానం నుంచి గరుడ నామ మంత్ర పఠనం నిర్వహించారు. మండ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్ చెలువరాయ స్వామి కుమారుడు సచిన్ దంపతులు పాల్గొని ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. అనంతరం గురూజీ మార్గదర్శనంలో చెలువనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

మేలుకోటెలో ఘనంగా గరుడ ధ్వజారోహణ