
ఉద్యోగ మేళాతో ఉపాధి అవకాశాలు
బళ్లారిఅర్బన్: ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేయర్ ముళ్లంగి నందీష్ అన్నారు. స్థానిక డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డు పబ్లిక్ స్కూల్, కాలేజిలో క్యాడ్‌మ్యాక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యాన్ని సాధించాలన్నారు. ఆ విద్య సంస్థ ముఖ్యస్థుడు డాక్టర్ మహిపాల్, గ్యారంటీ పథకాల అమలు కమిటీ జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, జోగిన్ చంద్రప్ప, బట్టి ఎర్రిస్వామి, శేఖర్ సంగనకల్లు విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
రాయచూరురూరల్: మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నిర్వహించిన న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన 21వ వార్షికోత్సవంలో స్వామీజీ పాల్గొని పంచాక్షరయ్యకు ఉత్తమ వ్యక్తి అదర్శ అవార్డు అందించి మాట్లాడారు. న్యాయవాది నాగప్ప బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు మహంతేష్ మస్కి, న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన అధ్యక్షుడు తిప్పారెడ్డి, నాగరాజ్, అంబాపతిపాటిల్, మల్లికార్జున పాల్గొన్నారు.

ఉద్యోగ మేళాతో ఉపాధి అవకాశాలు