
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు యువకులు కోరారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలోని తమ్మినేని నివాసంలో శుక్రవారం గువ్వలగూడెంకు యువకులు ఆయనను కలిసి సీపీఎంలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవటంతో ప్రజల సమస్యలపై ప్రస్తావన రావడం లేదని తెలిపారు. ఈమేరకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ఆయనను కోరారు. నాయకులు మారుతి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment