ఖమ్మంమయూరిసెంటర్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్ వెంట తమ ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్లను సమర్పించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇందులో అజయ్‌కుమార్ తన ఆస్తుల విలువను రూ.51,40,36,856గా చూపించారు. తన పేరిట చరాస్తులు రూ.7,55,06,145, స్థిరాస్తులు రూ.21,18,35,000గా పేర్కొనగా, ఆయన సతీమణి వసంతలక్ష్మి పేరిట చరాస్తులు రూ.4,40,35,711గా, స్థిరా స్తులు రూ.18,26,60,000 ఉన్నాయని తెలిపారు. కాగా, అజయ్‌కుమార్ పేరిట బ్యాంక్‌లో రూ.75,68,993 రుణం తీసుకోగా, 2022–23 ఏడాదిలో అజయ్‌కు రూ.89,93,070, ఆయన సతీమణికి రూ.1,60,10,070 ఆదాయం ఉన్నట్లు వెల్లడించారు.
గత ఎన్నికల్లో రూ.27కోట్లు!
2018 ఎన్నికల సమయంలో పువ్వాడ అజయ్ తనకు రూ.27,48,93,867 ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో చూపించారు. ఇందులో చరాస్తులు రూ.7,06,98,135, స్థిరాస్తులు రూ.4,80,48,000 ఉన్నాయని, ఆయన సతీమణి పేరిట చరాస్తులు రూ.3,89,17,619, స్థిరాస్తులు రూ.10,58,20,000, కుమారుడు నయన్‌రాజ్ పేర చరాస్తులు రూ.12,94,613, స్థిరాస్థులు రూ.1,01,25,500 ఉన్నాయని వెల్లడించారు. అదే అఫిడవిల్‌లో అజయ్‌కు రూ.1,50,63,694, వసంతలక్ష్మికి రూ.1,59, 24,007 బ్యాంక్‌ల్లో రుణం ఉందని తెలిపారు. ఇక ఆదాయం అజయ్‌కు రూ.67,39,150.. వసంతలక్ష్మికి రూ.1,15,79,740 ఉందని పేర్కొన్నారు.
తుమ్మల ఆస్తులు ఇవే..
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ఆస్తులను రూ. 17,88,82,858 గా చూపించారు. ఇందులో చరాస్తులు రూ.69,51,079 విలువైనవి ఉండగా, స్థిరాస్తులేమీ లేవని వెల్లడించారు. ఆయన సతీమణి భ్రమరాంబ పేరిట చరాస్తులు రూ.95,33,923 చూపించగా.. స్థిరాస్తుల విలు వ రూ.7,02,80,000 గా పేర్కొన్నారు. అలాగే,హెచ్‌యూఎఫ్(హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ)కు సంబంధించి చరాస్తులు రూ.2,32,87,566, స్థిరా స్తులు రూ.6.88 కోట్ల విలువైనవి ఉన్నాయని తెలిపారు.
కాగా, తుమ్మల సతీమణి పేరిట రూ. 81,56,736 బ్యాంక్ రుణం ఉండగా, తుమ్మల ఆదాయం రూ.8,83,870, ఆయన సతీమణికి పేరుతో రూ.49,21,280, హెచ్‌యూఎఫ్ కింద రూ. 49,93,820 ఆదాయం ఉందని పేర్కొన్నారు. కా గా, 2018 ఎన్నికల సమయాన ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో రూ.12,20,10,178 ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో అప్పటితో పోలిస్తే ఆస్తుల విలువ రూ.5కోట్ల మేర తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment