చింతకాని: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈజేఏసీ) జిల్లా కో–చైర్మన్‌గా మండల పరిధిలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు ఐ.కృష్ణార్జునరావు ఎన్నికయ్యారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయన ఎన్నిక పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్–475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర మహిళా కార్యదర్శులు రజియా సుల్తానా, షాహీనా బేగం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి మల్లయ్య, కొండా వినోద్‌బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు కంచర్ల శ్రీకాంత్, సత్యనారాయణ, నర్సింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, కోశాధికారి భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.