
జమలాపురంలో మాజీ సీజేఐ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారికి ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు.. శేషవస్త్రాలు, ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ కె.విజయకుమారి పాల్గొన్నారు.
వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన
జస్టిస్ ఎన్.వీ.రమణ