అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): టీడీపీలో బీసీలకు ఏమాత్రం గౌరవం లేదని మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు సంచలన ఆరోపణలు చేశారు. గౌరవం లేని చోట ఉండలేక ఆ పార్టీని వీడి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఉన్న వైఎస్సార్ సీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. విజయవాడ మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నానిలతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 1998 నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన రెండు సార్లు కార్పొరేటర్‌గా పనిచేయడంతో పాటు 2014లో డెప్యూటీ మేయర్‌గా సేవలందించారు.
మొత్తుకున్నా పట్టించుకోలేదు..
పార్టీలో చేరిన అనంతరం గోగుల రమణారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబుకు, లోకేష్‌కు, పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడికి గొంతుపోయేలా ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కరూ పట్టించుకోలేదని రమణారావు ఆరోపించారు. 2021లో 30వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీచేసిన తనను ఓడించేందుకు టీడీపీ సెంట్రల్ ఇన్‌చార్జ్ బొండా ఉమా ప్రయత్నించారన్నారు. అందుకు ఆ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. టీడీపీలో ఉండి తనను ఓడిస్తుంటే టీడీపీ అధిష్టానం వారిపై ఎటువంటి చర్యా తీసుకోలేదని చెప్పారు. బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్న యాదవులను ఏమాత్రం టీడీపీ పట్టించుకోకపోగా.. చులకనగా చూసిందని విమర్శించారు.
అదే సీఎం గొప్పతనం..
ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి అన్ని వర్గాల ప్రజలకు ఉన్నత పదవులను కేటాయించి, అందలం ఎక్కించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని ఆయన కొనియాడారు. కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా, అనిల్‌కుమార్ యాదవ్ మంత్రిగా, ముస్లిం మైనార్టీకి చెందిన అంజాద్ బాషా డెప్యూటీ సీఎంగా, ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనిత హోం మంత్రిగా ఉన్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో అందరికీ అర్థమవుతుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్ నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి తాను వైఎస్సార్ సీపీలో చేరానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment