గుడ్లవల్లేరు: దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో డిజిటల్ ఆటోమేషన్ వైపు అడుగులు పడుతున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కె.రాంజీ అన్నారు. గుడ్లవల్లేరు వీవీ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో 15వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ రాంజీతో పాటు కళాశాల కో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ, ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రాంజీ మాట్లాడుతూ.. ఒక కళాశాల ఉత్తమ విద్యను అందించాలంటే అధ్యాపకులు, మానవ వనరులతో పాటు మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమన్నారు. ఆ వనరులన్నీ ఈ కళాశాలకు ఉన్నా యని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇతర డిజిటల్ టూల్స్‌పై విద్యార్థులకు అవగాహన పెంచాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఎకడమిక్ టాపర్లు, ఆటల పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
1,05,617 బస్తాల
మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,18,783 బస్తాల మిర్చి వచ్చింది. నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానంలో 1,05,617 బస్తాలు విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్ –10 రకాల క్వింటా సగటు ధర రూ.9,500 నుంచి రూ.14 వేల వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు రూ.10 వేల ధర వచ్చింది.
కృష్ణా యూనివర్సిటీ వీసీ రాంజీ