
మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు
అప్పటి టీడీపీ ప్రభుత్వం మా భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి హక్కులను కోల్పోయేలా చేసింది. నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల గోడును అర్థం చేసుకొని 22ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ జీవోను జారీ చేశారు. ప్రసుత్తం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పేరుతో తీరప్రాంత భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
– కమ్మిలి కోటేశ్వరరావు,
రైతు, ఉల్లిపాలెం, కోడూరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిషేధిత భూములకు విముక్తి కలిగిస్తే.. కూటమి సర్కార్ మళ్లీ ‘చుక్క’ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటూ, రైతుల ఆధీనంలో ఉన్న భూములను నిషేధిత భూముల్లోకి చేర్చింది. 2016లో చంద్రబాబు హయంలోనే చుక్కల భూములను 22ఏ(1) నిషేధిత భూముల్లో చేర్చారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వారి అవసరాలకు అవి ఉపయోగపడని పరిస్థితి.
గత సెప్టెంబర్‌లోనే నిషేధిత జాబితాలో..
ఈ సమస్యను గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అర్హులైన రైతులకు యజమాన్య హక్కులు కల్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆ భూములను గత ఏడాది సెప్టెంబరులో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది.
35,669 ఎకరాల భూములకు విముక్తి
ఎన్నో ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న, రిజిస్ట్రేషన్ అయిన భూములను 2016లో నాటి సీఎం చంద్రబాబు 196 జీవో ద్వారా నిషేధిత జాబితాలో చేర్చారు. రాష్ట్రలోని 355 గ్రామాల్లో 22,042 మంది రైతులకు సంబంధించి 35,699 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో చేరాయి. ఈ సమస్య కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. 10,019 మంది రైతులకు సంబంఽధించి 15,791 ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. 2022 ఆగస్టులో నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఆనాటి కలెక్టర్.. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టారు. దీంతో 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగసభ ఏర్పాటు చేసి 22ఏ (1) నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి, రైతులకు యాజమాన్య హక్కు పత్రాలు అందజేశారు.
చికిత్సకు డబ్బులు
అందక ప్రాణం పోయింది
ముంబయిలో ఉంటున్న కె.నాగేశ్వరరావుకు కోడూరు మండలం సాలెంపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం ఉంది. గతంలో 22ఏ(1) కింద ఉన్న ఈ భూమిని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించారు. చంద్రబాబు వచ్చాక సర్వే పేరుతో మళ్లీ చుక్కల భూమిలో చేర్చారు. ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావుకు నాలుగు నెలల క్రితం కిడ్నీ సంబంధిత సమస్య వచ్చింది. ముంబయిలో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పిస్తే రోజుకు రూ.8వేలు ఖర్చు అవుతుందన్నారు. ఇక్కడనున్న పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకుందామని ఆయన భార్య ప్రభావతి ఇక్కడకు వచ్చి తనఖా రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే చుక్కల భూముల జాబితాలో ఉంది కుదరదన్నారు. తెలిసిన వారి వద్దకెళ్లి పాస్ పుస్తకాలు తనఖా పెట్టుకుని డబ్బులు ఇవ్వమంటే ఎవరూ ముందుకు రాలేదు. చికిత్సకు డబ్బులు అందక మూడు నెలల క్రితం చనిపోయాడు. చంద్రబాబు మళ్లీ చుక్కల భూముల జాబితాలో చేర్చడంతో పొలం ఉన్నా అక్కరకు రాక ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. నాగేశ్వరరావులాంటి బాధితులు ఎందరో ఉన్నారు.
ప్రభుత్వ భూముల సాకుతో
గతంలో ఒకసారి చుక్కల భూముల్లో చేర్చిన చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్‌లో మళ్లీ వీటిని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. వీటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయనే సాకుతో మరోసారి సర్వే చేసేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
రైతులకు తీవ్ర నష్టం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతలకు అండగా నిలిచి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఏన్నో ఏళ్లగా ఉన్న నిషేధిత భూముల సమస్యను కూడా పరిష్కరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు న్యాయం చేయాలి.
– సీహెచ్ విజయభాస్కరరావు,
రైతు, లింగారెడ్డిపాలెం, కోడూరు
కూటమి వచ్చాక మళ్లీ ‘చుక్క’ పెట్టారు
నాడు సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో
35,665 ఎకరాలకు విముక్తి
అవనిగడ్డలోనే 15,791 ఎకరాలు
ప్రస్తుతం రూ.లక్షల విలువైన భూములు
చేతిలో ఉన్నా అక్కరకు రాని పరిస్థితి

మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు

మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు

మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు